ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభ మ్యాచ్‌గా ఒకే ఒక సెట్‌తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన నెంబర్ వన్ ర్యాంకు ఆటగాడు రఫెల్ నాదల్.. ఓటమి చవిచూశాడు. అర్జెంటీనాకు చెందిన 109వ ర్యాంకు ఆటగాడు బ్రియాన్ డబుల్ చేతిలో అనూహ్యంగా 7-5తో నాదల్ పరాభవాన్ని ఎదుర్కొన్నాడు.
ఇప్పటి వరకు ఆరు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న నాదల్... రోలాండ్ గారోస్‌లో 28 మ్యాచ్‌లకు 28 మ్యాచ్‌లలో విజయం సాధించి రికార్డ్ సృష్టించాడు. కాగా, ఈ ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండులో బ్రెజిల్‌కు చెందిన క్వాలిఫైయర్ మార్కోస్ డేనియల్‌తో తలపడనున్నాడు. |