పారిస్ వేదికగా ప్రారంభమైన ఫ్రెంచ్ ఓపెన్‌లో తన తొలి మ్యాచ్ ఆడేందుకు భారత్‌కు చెందిన టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా సిద్ధమైంది. ఇందులో భాగంగా సానియా తన తొలి మ్యాచ్‌లో కజకిస్థాన్‌కు చెందిన గలీనా వొస్కోబొయేవాతో తలపడనుంది.
గాయం కారణంగా గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమైన సానియా సుధీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నమెంట్‌లో ఆడనుండడం విశేషం. అదేసమయంలో ఈ సీజన్‌లో సానియా క్లే కోర్టుల్లో కూడా ఆడకపోవడంతో తాజా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆమె ఏమేరకు రాణించనుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అయితే గాయంనుంచి కోలుకున్న తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో మిక్స్‌డ్ డబుల్స్‌లో భాగంగా భారత్‌కు చెందిన మహేష్ భూపతితో కలిసి టైటిల్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఫిబ్రవరిలో జరిగిన పట్టాయ ఓపెన్‌లో సైతం సానియా ఫైనల్ వరకు చేరుకోవడం గమనార్హం. ఈ రెండు అంశాల ఆధారంగా ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ సానియా సత్తా చాటగలదని భావిస్తున్నారు. |