చైనా వేదికగా ప్రారంభంకానున్న ఏసియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించడమే లక్ష్యంగా భారత బాక్సింగ్ టీం జుహాయ్ బయలుదేరివెళ్లింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో 15ఏళ్ల క్రితం స్వర్ణ పతకం సాధించిన భారత్ టీం ప్రస్తుతం మరోసారి స్వర్ణం తేవడమే లక్ష్యంగా విజేందర్ సింగ్ నేతృత్వంలోని పదిమంది సభ్యుల బృందం న్యూఢిల్లీనుంచి గురువారం బయలుదేరి వెళ్లింది.
గతంలో 2007లో జరిగిన ఈ టోర్నీలో విజేందర్ రజతం సాధించగా ఇప్పుడు మళ్లీ స్వర్ణం తెచ్చే దిశగా ప్రయత్నిస్తామని భారత బాక్సర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గత ఒలింపిక్‌లో కాంస్యం సాధించిన విజేందర్ సింగ్ మాట్లాడుతూ ఏ అంతర్జాతీయ టోర్నీకూడా అంత సులభం కాదని అయితే స్వర్ణం తేవడమే లక్ష్యంగా తాము ప్రయత్నిస్తామని అన్నాడు. |