తాజాగా సాధించిన ఫ్రెంచ్ ఓపెన్ విజయంతోనే రోజర్ ఫెదరర్ ఆగిపోడని రానున్న రోజుల్లో మరిన్ని విజయాలను తన ఖాతాలో వేసుకుంటాడని అమెరికాకు చెందిన మాజీ టెన్నిస్ క్రీడాకారుడు పీట్ సంప్రాస్ పేర్కొన్నాడు.
కెరీర్‌లో తొలిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ విజయాన్ని అందుకున్న ఫెదరర్ గురించి సంప్రాస్ మాట్లాడుతూ అత్యధిక గ్రాండ్‌స్లమ్‌ల కైవసం పేరుతో తన పేరుమీద ఉన్న రికార్డును సమం చేసిన ఫెదరర్ భవిష్యత్‌తో మరెన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ పోటీని తన ఇంటినుంచి టీవీలో తిలకించిన సంప్రాస్ ఫెదరర్ సాధించిన విజయంపై సంతృప్తిని వ్యక్తం చేశాడు.
అమెరికాకు చెందిన సంప్రాస్ 2002లో తన టెన్నిస్ కెరీర్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కెరీర్ మొత్తం మీద 14 గ్రాండ్‌స్లమ్ టైటిల్‌లను నెగ్గిన సంప్రాస్ పురుషుల సింగిల్స్‌లో మకుటం లేని మహరాజుగా కొనసాగాడు. సంప్రాస్ సాధించిన ఈ 14 గ్రాండ్‌స్లమ్‌ల రికార్డును మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన ఫెదరర్ ఫ్రెంచ్ ఓపెన్ విజయంతో సమం చేసిన సంగతి తెలిసిందే.
కెరీర్‌లో ఎన్ని గ్రాండ్‌స్లమ్‌లను సాధించినా అందని ద్రాక్షలా ఊరించిన ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించడం ద్వారా ఫెదరర్ తన కలను నెరవేర్చుకున్నట్టైంది. |