ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయం: 5వ స్థానానికి పేస్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఫ్రెంచ్ ఓపెన్‌లో విజయం: 5వ స్థానానికి పేస్
FileFILE
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో జైత్రయాత్ర సాగించిన భారత స్టార్ ఆటగాడు లియాండర్ పేస్ 1700 పాయింట్లు దక్కించుకుని ఏటీపీ తాజా డబుల్స్ ర్యాంకుల్లో ఐదో స్థానానికి ఎగబాకాడు. సోమవారం ఈ తాజా ర్యాంకుల జాబితాను అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య విడుదల చేసింది.

అంతకుముందు.. 6560 పాయింట్లతో ఉన్న పేస్ ఫ్రెంచ్ ఓపెన్‌తో పాటు మొత్తం తొమ్మిది గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుని మొత్తం 8260 పాయింట్లు తన ఖాతాలో జమచేసుకున్నాడు. మరోవైపు బహమాస్‌కు చెందిన పేస్ భాగస్వామి మార్క్ నోవెల్స్... ఫ్రెంచ్ ఓపెన్‌ ప్రీ-క్వార్టర్స్ నుండే వైదొలిగాడు. దీంతో నోవెల్స్ 5560 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు.

అదలా ఉంచితే.. డబ్ల్యూటీఏ ర్యాంకుల్లో భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మూడు స్థానాలు దిగజారి 98వ ర్యాంకుకు పడిపోయింది. డబుల్స్‌లో మాత్రం నాలుగు స్థానాలు ఎగబాకి 39వ స్థానానికి సానియా చేరుకుంది. ఫ్రెంచ్ ఓపెన్‌ సింగిల్స్ విభాగం తొలి రౌండు నుండే సానియా వైదొలగగా.. డబుల్స్‌లో రెండో రౌండు వరకు మాత్రమే వెళ్లగలిగింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
హాకీ ప్రపంచకప్‌లో సింగపూర్‌పై భారత్ విజయం
ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్: సెమీస్‌కు గోవా
ప్రపంచకప్ ఆర్చరీ: తలుక్దర్‌కు కాంస్యం
ఫ్రెంచ్‌లో నమ్మకాన్ని కోల్పోలేదు: ఫెదరర్
ఆమెను చూసి స్పూర్తి చెందా: పేస్
ఫార్ములావన్: కొనసాగుతున్న బటన్ హవా