సింగపూర్ వేదికగా జరుగుతున్న సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు చెందిన ఒలింపిక్ ఆటగాడు అనూప్ శ్రీధర్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. తొలిరెండు రౌండ్ల మ్యాచ్‌లలో విజయం సాధించడం ద్వారా శ్రీధర్ ఈ మెయిన్ డ్రాకు చేరుకున్నాడు.
టోర్నీలో రెండో సీడ్‌గా అడుగుపోట్టిన శ్రీధర్ తన తొలిరౌండ్ మ్యాచ్‌లో కెనడాకు చెందిన స్టీఫెన్‌ను 21-10, 21-11 తేడాతో చిత్తు చేయడం ద్వారా విజయం సాధించాడు. అలాగే రెండో రౌండ్ మ్యాచ్‌లో చైనాకు చెందిన యన్బో క్యూను 15-21, 21-19, 21-17 స్కోరు తేడాతో ఓడించడం ద్వారా రెండో విజయాన్ని సాధించాడు. ఈ రెండు విజయాలత శ్రీధర్ మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.
అదేసమయంలో భారత్‌కు చెందిన ఆనంద్ పవార్ ఈ టోర్నీనుంచి నిష్క్రమించాడు. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లలో భాగంగా రెండు రౌండ్లలోనూ పరాజయం చవిచూడడం ద్వారా ఆనంద్ ఇంటిముఖం పట్టాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆనంద్ 16-21, 15-21 తేడాతో కెనడాకు చెందిన ఆండ్రూ చేతిలో చిత్తయ్యాడు. అలాగే రెండో రౌండ్ మ్యాచ్‌లో 14-21, 16-21 తేడాతో జపాన్‌కు చెందిన కుజుసీ చేతిలో కంగుతిన్నాడు. దీంతో ఆనంద్ టోర్నీనుంచి నిష్క్రమించక తప్పలేదు. |