ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జాతీయ సీనియర్ హాకీ ఛాంపియన్‌షిప్‌ను పూనేలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని హాకీ ఇండియా గురువారం అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం సెప్టెంబర్ 13నుంచి 27వరకు ఈ టోర్నీ జరగనుంది.
ఈ ఛాంపియన్‌షిప్ ఆతిధ్యం గురించి చర్చించేందుకై బుధవారం సమావేశమైన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆఫ్ హాకీ ఇండియా పూనేను ఎంపిక చేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని హాకీ ఇండియా ప్రధాన కార్యదర్శి అస్లామ్ ఖాన్ నిర్ధారించారు. |