ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > భారత్ హాకీని మెరుగుపరచడంపై బ్రాసా దృష్టి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారత్ హాకీని మెరుగుపరచడంపై బ్రాసా దృష్టి
FileFILE
హాకీని మెరుగుపరచడంపై తాము దృష్టి సారించినట్లు భారత జట్టు హాకీ కోచ్‌గా కొత్తగా ఎంపికైన జోస్ మాన్యూల్ బ్రాసా వెల్లడించారు. భారత జట్టు ఎంపికలో మార్పులు తీసుకురావడం, యూరోపియన్‌, కొరియన్, ఆస్ట్రేలియన్‌ల తరహాలో భారత ఆటగాళ్ల శైలి ఉండేలా చూస్తున్నామన్నారు.

పూనేలో బ్రాసా మాట్లాడుతూ, అంతర్జాతీయ పోటీల్లో విదేశీ జట్ల స్థాయికి తగ్గ విధంగా ఎన్నో మార్పులను భారత జట్టులో తీసుకురావలసి ఉందన్నారు. టెక్నిక్‌లు, సంప్రదాయ ఆటతీరు, నైపుణ్యంలలో ఇలాంటి మార్పులు అవసరమన్నారు. నిజానికి.. జట్టులో నైపుణ్యానికి కొదవలేకపోయినా.. సమయానుకూలంగా, ప్రతికూల పరిస్థితుల్లోను దాన్ని ఉపయోగించే తీరు తెలుసుకోవలసి ఉందన్నారు.

నేటి నుండి ప్రారంభమయ్యే దీర్ఘకాలిక క్యాంప్‌‌లో వేగవంతమైన శిక్షణను ఆటగాళ్లకు ఇచ్చేలా ప్రణాళిక చేశామన్నారు. ఈ క్యాంప్‌లో ప్రాబబుల్స్ ఆటగాళ్ల జాబితాను కూడా సిద్ధం చేస్తామని బ్రాసా తెలిపారు. కాగా, పూనేలోని శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో ప్రారంభం కానున్న ఈ క్యాంప్‌లో సీనియర్ హాకీ జట్టు పాల్గొంటుంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంటా: ఆనంద్
భండారీని సత్కరించిన ఉత్తరాఖండ్ సీఎం
ఇండోనేషియా ఓపెన్: మెయిన్ డ్రాకు పవార్
ఎగాన్ డబుల్స్ నుండి సానియా జోడీ నిష్క్రమణ
ఏటీపీ టోర్నీ రెండో రౌండులో భూపతి, నోవెల్స్ జోడీ
జులై 10న సానియా-సోహ్రబ్ నిశ్చితార్థం!