ఈ ఏడాది ప్రారంభం కానున్న వార్షిక సైకిల్ పోటీలు టూర్ డీ ఫ్రాన్ టోర్నీలో పాల్గొననున్న రైడర్లపై ఫ్రెంచ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (ఏఎఫ్ఎల్‌డీ) దృష్టి సారించింది. ఈ విషయాన్ని ఏఎఫ్ఎల్‌డీ అధ్యక్షుడు పియరీ బోర్డ్‌రి వెల్లడించారు.
పారిస్‌లో విలేకరులతో పియరీ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో డోపింగ్ సంఘటనలు తరచుగా వెలుగుచూస్తుండటంతో ఈ టూర్‌లో అలాంటి తరహా అంశాలు రాకుండా చూస్తున్నామన్నారు. ఇందుకోసం సరికొత్త పరీక్షలను తమ ఏజెన్సీ ప్రణాళిక చేస్తోందన్నారు.
డోపింగ్‌కు పాల్పడతారనుకుంటున్న రైడర్స్ జాబితా ఫ్రెంచ్ ఎజెన్సీ వద్ద ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమ ఏజెన్సీ డైరెక్టర్లకు డోపింగ్ సంబంధిత పరీక్షలు చేయడం బాగా తెలుసున్నారు. అయితే ఈ డోపింగ్ ఏజెన్సీ జాబితాలో ఎవరున్నారు ? లేదా ఇందులో ఎంత మంది ఉన్నారనే దానిపై ఆయన వ్యాఖ్యానించలేదు.
కానీ, అంతర్జాతీయ సైక్లింగ్ యూనియన్ అధ్యక్షుడు పాట్ మెక్‌క్వాడ్ మాట్లాడుతూ, ఈ జాబితాలో 50 మంది రైడర్లు ఉన్నారని తెలిపారు. కాగా, గత ఏడాది యూనియన్ సైక్లిస్ట్ ఇంటర్నేషనల్ (యూసీఐ) మరియు ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (డబ్ల్యూఏడీఏ)లు సంయుక్తంగా ప్రొఫెషనల్ రైడర్లు అందరి నుండి రక్తపు నమూనాలను సేకరించారు. దీని ద్వారా ప్రతి రైడర్‌కు సంబంధించిన మెడికల్ ప్రొఫైల్ లేదా పాస్‌పోర్ట్‌లను రూపొందిస్తారు. అక్కడ రిజిష్టర్ అయిన డేటాను డోపింగ్ పరీక్షల సమయంలో పోల్చి చూస్తారు. |