ప్రతిష్టాత్మక వింబుల్డన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ముగ్గురు భారతీయుల మధ్య జరిగిన యుద్ధంలో లియాండర్ పేస్ గెలుపొందాడు. ఈ టోర్నీలో జింబాబ్వే క్రీడాకారిణి కారా బ్లాక్‌తో జత కట్టిన పేస్.. భారత టెన్నిస్ స్టార్ జోడీ మహేశ్ భూపతి-సానియా మీర్జాలపై తిరుగులేని విజయాన్ని నమోదు చేశాడు.
ఈ రెండు జోడీల మధ్య మ్యాచ్ సుమారు రెండు గంటలకు పైగా జరిగింది. ఈ రసవత్తర పోరులో మహేశ్-సానియా జోడీపై 6-2, 6-7 (2), 6-3తో టాప్ సీడ్ జోడీ పేస్-బ్లాక్‌లు గెలుపొందారు. ఈ టోర్నీలోను అత్యుత్త జోడీగా బరిలోకి దిగింది.
13వ సీడ్‌గా బరిలోకి దిగిన మహేశ్-సానియా జోడీ అనేక డబుల్స్ ఫాల్ట్‌లు చేశారు. తొలి సెట్లోనే పేస్-బ్లాక్ జోడీ 8 బ్రేక్ పాయింట్లు సాధించింది. అనవసర తప్పిదాలు చేయకుండా పేస్-బ్లాక్ జోడీ జాగ్రత్త పడింది. ఈ ఒత్తిడిలో రెండో సెట్ కోల్పోవలసి వచ్చింది.
పేస్-బ్లాక్‌ల జోడీ గత ఏడాదిలో జరిగిన యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‍ను గెలుచుకుంది. కాగా, తమ తర్వాత మ్యాచ్‌లో బ్రెజిల్-జపాన్ జోడీ ఆండ్రీ సా, సుగియామా.. స్వీడన్-ఆస్ట్రేలియా జోడీ రాబర్ట్ లిండ్‌స్టెట్, రెనీ స్టబ్స్‌లు... ఈ రెండు జోడీల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో పేస్-బ్లాక్ జోడీ క్వార్టర్స్‌లో తలపడనుంది. |