కొచ్చిలో జరిగిన 21వ కొచ్చిన యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్ టైటిల్ తమిళనాడుకు చెందిన రామ్ ఎస్ క్రిష్ణన్ కైవసం చేసుకున్నాడు. ఈటోర్నీలో మొత్తం 10 రౌండ్లలో పాల్గొన్న రామ్ 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.ఫైనల్ రౌండులో జట్టు సభ్యుడైన జె శ్రీధర్‌పై రామ్ తిరుగులేని విజయం నమోదు చేశాడు.కాగా, ఈటోర్నీలో తొలి పదిస్థానాల్లో నిలిచిన ఆటగాళ్లు: 1. రామ్ ఎస్ క్రిష్ణన్ (తమిళనాడు), 2. శ్రీనివాస రావు (ఆంధ్రప్రదేశ్), 3. ఎంఏ జాయ్ లేజర్ (కేరళ), 4. సీఆర్‌జీ క్రిష్ణా (ఆంధ్రప్రదేశ్), 5. ఓటీ అనిల్ కుమార్ (కేరళ), గణేష్ బాబు (తమిళనాడు), 7. జె శ్రీధర్ (తమిళనాడు), 8. లిండా రంగరాన్ (పాండిచ్చేరి), 9. టీఎస్ సెంథిల్ కుమారన్ (తమిళనాడు), 10. ఉత్తర్ శర్మా (తమిళనాడు). |