మాజీ ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు, స్విట్జర్లాండ్ టెన్నిస్ సంచలన ఆశాకిరణం రోజర్ ఫెదరర్ వింబుల్డన్‌లో ఓ మెరుపు మెరుస్తున్నాడు. వింబుల్డన్ టైటిల్ గెలుచుకునేందుకు జరుగుతున్న పోరులో ఫెదరర్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్లో 22వ సీడ్ కార్లోవిచ్ (క్రొటియా)ను మట్టికరిపించాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రత్యర్థిపై గట్టిపోటీని ప్రదర్శించిన రోజర్ ఫెదరర్ 6-3, 7-5, 7-6 తేడాతో కార్లోవిచ్‌ను ఓడించాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను సొంతం చేసుకున్న సందర్భంగా ఫెదరర్ మాట్లాడుతూ.. సెమీఫైనల్లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నాడు. సెమీఫైనల్లోనూ మెరుగైన ఆటతీరును ప్రదర్శించేందుకు కృషి చేస్తానని చెప్పాడు. ఇదిలా ఉంటే.. సెమీఫైనల్ మ్యాచ్‌లో రోజర్ ఫెదరర్ టామీ హాస్ లేదా నొవాక్ జకోవిక్‌లలో ఎవరైనా ఒకరితో తలపడతాడు. |