కాన్ఫడరేషన్ టైటిల్ నెగ్గిన బ్రెజిల్ తాజా అంతర్జాతీయ ఫుట్‌బాల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండేళ్ల తర్వాత బ్రెజిల్ తిరిగి నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుని స్పెయిన్‌ను వెనక్కి నెట్టింది.
ఫిఫా బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో.. కాన్ఫడరేషన్ సెమీఫైనల్లో అమెరికా చేతిలో కంగుతిన్న స్పెయిన్ రెండో స్థానానికి దిగజారింది.
దీంతో ఇంతవరకు అగ్రస్థానంలో కొనసాగుతోన్న స్పెయిన్ రెండో స్థానంలోనూ, ఇటలీ నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఇక భారత్ 147వ స్థానంలోనే కొనసాగుతోంది. ఇంకా ఆసియాలోనే 23వ స్థానంలో భారత్ నిలిచింది. |