టాటా ఓపెన్‌లో తన సత్తా చూపిస్తానని భారత నెంబర్ వన్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ అన్నాడు. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి, విజయాలు చేతికందుకోలేని పరిస్థితిలో ఉన్న చేతన్ ఆనంద్.. టాటా ఓపెన్ టైటిల్ సాధించి మళ్లీ గాడిలో పడతానని విశ్వాసం వ్యక్తం చేశాడు.
ముంబైలో శుక్రవారం జరిగే మెయిన్ "డ్రా" తొలి రౌండ్‌లో చేతన్ ఆనంద్ బరిలోకి దిగనున్నాడు. టాటా ఓపెన్ సాధిస్తే.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ముందుకు కావాల్సినంత ఆత్మవిశ్వాసం, ప్రాక్టీస్ లభిస్తుందని ఆనంద్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే.. టాటా ఓపెన్ తర్వాత ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు జరిగే థాయ్‌లాండ్ ఓపెన్లో చేతన్ పాల్గొననున్నాడు. ఈ టోర్నీలోనూ గట్టిపోటీని ప్రదర్శించేందుకు కృషి చేస్తానని ఆనంద్ వెల్లడించాడు. |