లండన్‌లో జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో బ్రిటన్ ఆటగాడు రాడిక్ హెవిట్‌పై సంచలన విజయం సాధించాడు. 22 ఏళ్ల రాడిక్ హోరాహోరీగా జరిగిన పోరులో హెవిట్‌ను 6-3, 6-7 (10/12), 7-6 (7/1), 4-6, 6-4 పాయింట్ల తేడాతో మట్టికరిపించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.
మరోవైపు.. ఐదుసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన స్విట్జర్వాండ్ ఛాంపియన్ రోజర్ ఫెదరర్ కూడా సెమీఫైనల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఇదేవిధంగా ఆండీ ముర్రే తొలిసారిగా వింబుల్డన్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్ పైనల్లో స్పెయిన్ మాజీ ఫ్రెంచ్ ఓపెన్ విజేత కార్లోస్ ఫెరెరోను 7-5, 6-3, 6-2 పాయింట్ల తేడాతో ఓడించాడు. |