ఆల్ ఇండియా అగా ఖాన్ హాకీ టోర్నమెంట్ జూలై 3వ తేదీ (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. మహారాష్ట్ర హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా దాదాపు 40 జట్లు పాల్గొంటున్నాయి. మహారాష్ట్రలోని పింపిరి పీసీఎంసీ స్టేడియంలో ఈ పోటీలు శుక్రవారం నుంచి ప్రారంభమౌతాయని మహారాష్ట్ర హాకీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇక్రామ్ ఖాన్ తెలిపారు. ఎఎస్‌సీ బెంగళూరు, సెంట్రల్ రైల్వే భుస్వాల్, సెంట్రల్ రైల్వే నాగ్‌పూర్, సతారా సంగ్లీ, కోల్హాపూర్‌లకు చెందిన వివిధ జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. దీంతో పాటు బాలబాలికలకు ఇంటర్-స్కూల్ టోర్నమెంట్‌ను కూడా ఇదే వేదికలో నిర్వహించేందుకు మహారాష్ట్ర హాకీ అసోసియేషన్ రంగం సిద్ధం చేసినట్లు ఖాన్ వెల్లడించారు. |