ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత భూపతి జోడీకి చుక్కెదురైంది. ఈ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగం నుంచి మహేష్ భూపతి (భారత్)- మార్క్ నోలెస్ (బహమాస్) జంట నిష్క్రమించింది. వింబుల్డన్ పురుషుల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ భూపతి జంట.. దక్షిణాఫ్రికా-బెల్జియంకు చెందిన వెస్లీ మూడీ/ డిక్ నార్మన్ జోడీ చేతిలో 6- 7, 6- 4, 6- 7, 5- 7, 4- 6 పాయింట్ల తేడాతో పరాజయం పాలైంది. 3 గంటల 37 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో ఇరు జంటలు సర్వీస్ గేమ్‌లను అద్భుతంగా ఆడాయి. అయితే టై-బ్రేకర్‌కు ఆడే ఆటలో మూడీ-నార్మన్ జోడీ గెలిచింది. దీంతో క్వార్టర్ ఫైనల్‌లో రెండు సెట్లను మాత్రమే సొంతం చేసుకున్న భూపతి జోడీ ఓటమిని పాలై వింబుల్డన్ నుంచి వైదొలగింది. |