ఆసియన్ జూనియర్ వ్రెస్ట్‌లింగ్ ఛాంపియన్‌షిప్ ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 24 క్రీడాకారులతో కూడిన భారత వ్రెస్ట్‌లింగ్ జట్టు మానియాలాకు జూలై ఆరోతేదీన ప్రయాణం కానుంది. భారత పురుషుల, మహిళల జట్లకు ఒ.పి. యాదవ్, అనితలు కోచ్‌లుగా వ్యవహరిస్తారు.
ఈ ఛాంపియన్ షిప్‌లో భారత మహిళా జట్టు తరపున కవిత (44కేజీలు), యు.పి. ప్రియాంక (48కేజీలు), అంజు (51కేజీలు), గార్గి (55కేజీలు), మలిక్ (59 కేజీలు), హర్యానా ప్రొమిల్లా (63కేజీలు), నవ్‌జోత్ కౌర్ (67కేజీలు), పంజాబ్ అన్మోల్ (72కేజీలు) పాల్గొంటారు.
వీరిలో ప్రియాంక జూలై 2008లో జరిగిన వరల్డ్ వ్రెస్ట్‌లింగ్ పోటీల్లో కాంస్యపతకం సాధించగా, ఆసియన్ జూనియర్ వ్రెస్ట్‌లింగ్ పోటీలో గార్గి కూడా కంచు పతకాన్ని సొంతం చేసుకుంది. |