కర్నాటక బ్యాంక్ ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ మంగళూరులో ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానుంది. ముగ్గురు గ్రాండ్ మాస్టర్లు, 16 మంది భారతీయ చెస్ మాస్టర్లతో పాటు దాదాపు 400మంది క్రీడాకారులు పాల్గొనే ఈ చెస్ టోర్నీని సౌత్ కనరా డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ (ఎస్‌కెడిసిఎ) నిర్వహిస్తోంది. ఈ టోర్నీలో జిబి. ప్రకాష్, రత్నాకరన్, మాజీ జాతీయ ఛాంపియన్ బాలసుబ్రహ్మణ్యం, అక్షయ్ రాజ్ కోర్, మురళీకృష్ణ, మాజీ జాతీయ ఎ ఛాంపియన్ దినేష్ కుమార్‌లతో పాటు పలువురు ఛాంపియన్లు పాల్గొంటారని ఎస్‌కెడిసిఎ అధ్యక్షుడు గురురాజ్ చెప్పారు. దాదాపు 62 మంది భారతీయ చెస్ క్రీడాకారులు ఇందులో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇందులో గట్టిపోటీని ప్రదర్శించి విజేతగా నిలిచే చెస్ ఆటగాళ్లు ఆగస్టు 1 నుంచి 9వతేదీ వరకు దేశరాజధాని నగరమైన ఢిల్లీలో జరిగే ఆసియన్ యూత్ చెస్ ఛాంపియన్‌లో పాల్గొనే అవకాశముందని గురురాజ్ వివరించారు. |