ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్-అతని భాగస్వామి జింబాబ్వేకు చెందిన కారా బ్లాక్‌ల జోడీ అంతిమ పోరుకు సిద్ధమైంది. ఈ టోర్నీ సెమీస్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-స్పానిష్ జోడీ స్టీఫెన్ హస్ మరియు వర్జీనియా రువానో పాస్కల్‌లపై పేస్ జోడీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.గత ఏడాది యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న ఈ జోడీ ఈ ఏడాది ప్రతిష్టాత్మక వింబుల్డన్ టైటిల్ గెలుచుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. అంతకుముందు వరుస విజయాలతో ఈ టోర్నీ సెమీస్‌లో ప్రవేశించిన పేస్-బ్లాక్, అసీస్-స్పానిష్‌ల జోడీపై 6-4, 6-4తో 71 నిమిషాలు పోరాడి గెలుపొందింది. తద్వారా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.ఫైనల్లో... తొమ్మిదో సీడ్ జోడీ బహామాస్‌కు చెందిన మార్క్ నోవెల్స్, జర్మనీకి చెందిన అనా లీనా మరియు అన్ సీడెడ్ జోడీ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జామీ ముర్రే, అమెరికాకు చెందిన లీజెల్ హ్యూబర్‌ల మధ్య జరిగే మ్యాచ్ విజేతతో పేస్ జోడీ తలపడనుంది. |