ఈ సారైనా ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ టైటిల్ గెలవాలన్న బ్రిటన్ కల చెదిరిపోయింది. దీంతో ఈ టోర్నీలో పాత కథే మళ్లీ పునరావృతమైంది. మరో ఏడాది పాటు బ్రిటన్‌కు నిరీక్షణే మళ్లీ శరణ్యమైంది. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరి కప్ సాధిస్తాడనుకున్న బ్రిటన్ టెన్నిస్ యోధుడు ఆండీ ముర్రే సెమీస్ నుండే అనూహ్యంగా వైదొలిగాడు.1938 లో బన్నీ అస్టిన్ తర్వాత వింబుల్డన్ పురుషుల టైటిల్ బ్రిటన్‌కు అందని ద్రాక్ష పండు పరిస్థితే అయింది. ప్రతి ఏడాది పట్టుదలతోనే ఈ టోర్నీలో బ్రిటన్ అడుగిడుతోంది. అలాడే ఈ సారి కూడా వచ్చింది. కానీ ముర్రేపై కొండంత ఆశలు పెట్టుకున్న బ్రిటన్‌కు ఈ సారి కూడా చేదు అనుభవం తప్పలేదు. ఈ టోర్నీ సెమీస్‌లో అమెరికాకు చెందిన ఆండీ రాడిక్‌తో ముర్రే తలపడ్డాడు.ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన 2003 యూఎస్ ఓపెన్ టైటిల్ విజేత, మాజీ ప్రపంచ నెంబర్ వన్ రాడిక్‌తో ముర్రే హోరాహోరీగా తలపడ్డాడు. అయితే మధ్యలో టైబ్రేక్‌ల రూపంలో అవకాశాలు వచ్చినా ముర్రే వినియోగించుకోలేకపోయాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రాడిక్ చేతిలో 6-4, 4-6, 7-6, 7-6తో ముర్రే కంగుతిన్నాడు. |