సింగపూర్‌లో జరుగుతున్న ఆసియా యూత్ క్రీడల్లో ఐదు పసిడి పతకాలతో కలిపి మొత్తం 10 పతకాలు.. భారత్ ఖాతాలో చేరాయి. ఈ పతకాలు భారత అథ్లెట్ల అద్భుతమైన ప్రదర్శనకు నిదర్శనంగా క్రీడా వర్గాలు తెలిపాయి.
చివరి రోజు ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్‌లో.. పురుషుల 800 మీటర్ల ఈవెంట్‌లో రవి కుమార్ పసిడి పతకాన్ని సాధించగా మహిళల విభాగంలో నమితా కబాత్ ఛాంపియన్‌గా నిలిచింది. న్యూఢిల్లీలో క్రీడా మంత్రిత్వ శాఖ ద్వారా అందిన వివరాల ఈ విధంగా ఉన్నాయి.
మొత్తం ఐదు పసిడి పతకాల్లో తొలుత నాలుగు గెలిచిన భారత అథ్లెట్లు.. ఐదోది స్విమ్మింగ్ విభాగంలో కైవసం చేసుకున్నారు. అలాగే మరో మూడు రజతం, రెండు కాంస్య పతకాలతో ఈ క్రీడల్లో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 800 మీటర్ల ఈవెంట్‌లో రవి 1:55.91 సెకనుల్లో లక్ష్యాన్ని చేరగా.. రెండో స్థానంలో ఇరాన్‌కు చెందిన అమీర్, మూడో స్థానంలో శ్రీలంకకు చెందిన హెరాత్ ఈ నిలిచారు. |