ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: ఫిలిప్పైన్స్‌కు భారత జట్టు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: ఫిలిప్పైన్స్‌కు భారత జట్టు
FileFILE
జూలై 9 నుండి ఫిలిప్పైన్స్‌లోని మనిలాలో ప్రారంభం కానున్న ఆసియా జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనడం కోసం 24 మంది సభ్యులు గల భారత జట్టు బయలుదేరి వెళ్లనుంది. జూలై 6న భారత జట్టు ఫిలిప్పైన్స్‌ చేరుకుంటుంది. జూలై 9 నుండి 13వ తేదీ వరకు రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ జరుగుతుంది.

ఈ ఛాంపియన్‌షిప్‌కు వెళ్లే బాలుర విభాగానికి స్పోర్ట్స్ అధారిటీ సాయ్ తరపున ఓ పీ యాదవ్.. బాలికల విభాగానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనిత
కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. గ్రికో-రోమన్‌లో ఎనిమిది మంది.. ఫ్రీస్టైల్‌లో ఎనిమిది మంది బాలురు పోటీ పడనున్నారు. ఈ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతనిధ్యం వహించే వీరిందరూ జలంధర్‌‌లో తర్ఫీదు పొందారు.

కాగా, బాలికల జట్టులో.. కవిత (44 కేజీలు), యూపీ ప్రియాంకా (48 కేజీలు), యూపీ అంజు (51 కేజీలు), యూపీ గార్గీ (55 కేజీలు), యూపీ ఎస్. మాలిక్ (59 కేజీలు), హర్యానా ప్రొమిల్లా (63 కేజీలు), ఎంపీ నవజ్యోత్ కౌర్ (67 కేజీలు), పంజాబ్ ఆన్మోల్ (72 కేజీలు)లు ఉన్నారు. 2008 జూలై టర్కీలో జరిగిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రియాంకా కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

2008 జూలై‌లో దోహాలో జరిగిన ఆసియా జూనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో గార్గీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఫిలిప్పైన్స్‌లో జరుగనున్న టోర్నీలోను పతకాన్ని సాధించగలదనే అంచనాలున్నాయి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆసియా యూత్ క్రీడల్లో భారత్‌కు 5 స్వర్ణాలు
బ్రిటన్ కల చెదిరింది: వింబుల్డన్‌లో మళ్లీ పాత కథే
వింబుల్డన్‌: అంతిమ పోరుకు సిద్ధమైన పేస్ జోడీ
మంగళూరులో ఆల్ ఇండియా చెస్ టోర్నీ
9 నుంచి జూనియర్ వ్రెస్ట్‌లింగ్ పోటీలు
వింబుల్డన్: టామీ హాస్‌తో ఫెదరర్ ఢీ నేడే!