ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణమే లక్ష్యం: సుషీల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణమే లక్ష్యం: సుషీల్
FileFILE
డెన్మార్క్‌లో సెప్టెంబర్ 21 నుండి ప్రారంభం కానున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని ఒలింపిక్ కాంస్య పతక వీరుడు సుషీల్ కుమార్ వెల్లడించాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకాన్ని నెగ్గి దేశానికి మరిన్ని పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

ఇటీవలే జర్మనీ గ్రాండ్ ప్రిక్స్ టోర్నీలో సుషీల్ స్వర్ణ పతకం సాధించాడు. ప్రస్తుతం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నేతృత్వంలో న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న శిక్షణ క్యాంప్‌లో సుషీల్ పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న తర్వాత తాను అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నానని తెలిపాడు.

అయితే అవేవీ తన ప్రాక్టీసుకు అడ్డంకిగా నిలవలేదని వివరించాడు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని తాను సిద్ధమవుతున్నానని వ్యాఖ్యానించాడు. తన నైపుణ్యతపై విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, 2003 అమెరికాలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో సుషీల్ నాలుగో స్థానంలో నిలిచాడు.

ఆ తర్వాత 2007లో అజెర్బైజాన్‌లో జరిగిన టోర్నీలో ఈవెంట్‌లో సుషీల్ ఏడో స్థానంలో నిలిచాడు. దీంతో 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. రెజ్లింగ్ కోచ్ సత్పాల్ మాట్లాడుతూ, డెన్మార్క్‌లో జరుగనున్న పోటీల్లో తన విద్యార్థి సుషీల్.. అనుకున్నది సాధించగల సత్తా గలవాడని విశ్వాసం వ్యక్తం చేశాడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
యూరప్ పర్యటన కోసం హాకీ జట్టు ఎంపిక
రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్: ఫిలిప్పైన్స్‌కు భారత జట్టు
ఆసియా యూత్ క్రీడల్లో భారత్‌కు 5 స్వర్ణాలు
బ్రిటన్ కల చెదిరింది: వింబుల్డన్‌లో మళ్లీ పాత కథే
వింబుల్డన్‌: అంతిమ పోరుకు సిద్ధమైన పేస్ జోడీ
మంగళూరులో ఆల్ ఇండియా చెస్ టోర్నీ