సుమారు 25 రోజుల పాటు సాగే యూరప్ పర్యటనకు వెళ్లాల్సిన భారత జట్టును హాకీ ఇండియా మంగళవారం ఎంపిక చేసింది. స్పానియార్డ్ జోస్ బ్రాసా భారత జట్టు కోచ్‌గా ఆరంగేట్రం చేసిన చోటనే.. ఈ 23 మంది సభ్యులు గల జట్టును ఖరారు చేశారు.భారత జట్టు కెప్టెన్‌గా డ్రాగ్‌ఫ్లికర్ సందీప్ సింగ్ తిరిగి ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్, బెల్జియం, స్పెయిన్, హాలెండ్‌లతో భారత జట్టు మొత్తం 12 టెస్ట్ సిరీస్‌లు ఆడనుంది. కాగా, జట్టులోకి ఎంపికైన సభ్యుల్లో ఇద్దరు గోల్‌కీపర్లు, ఇద్దరు డిఫెండర్లు, ఎనిమిది మంది మిడ్‌ఫీల్డర్లు మరియు 11 మంది ఫార్వార్డ్‌ర్‌లు ఉన్నారు.మ్యాచ్‌లు: బిర్మింగమ్‌లో జూలై 27 నుండి ఆగస్ట్ 2వరకు ఇంగ్లాండ్‌తో నాలుగు టెస్ట్‌లు, దాని తర్వాత ఆంట్‌వెర్ప్‌లో ఆగస్ట్ 4 నుండి 7వ తేదీ వరకు బెల్జియంతో మూడు టెస్ట్‌లు, టెరస్సాలో ఆగస్ట్ 9 నుండి 12వ తేదీ వరకు స్పెయిన్‌తో మూడు మ్యాచ్‌లు, ఆమ్‌స్టెల్‌వీన్‌లో ఆగస్ట్ 14 నుండి 16వ తేదీ వరకు హాలెండ్‌తో రెండు టెస్ట్‌లు భారత్ జట్టు ఆడనుంది. |