అత్యుత్తమ క్రీడా మౌళికసదుపాయాలను కల్పించడం ద్వారా గ్రామాల్లో క్రీడా వృద్ధిని సాధించడంలో హిమాచల్ ప్రదేశ్ కీలక పాత్ర వహిస్తోందని పార్లమెంట్ సభ్యుడు వీరేందర్ కాశ్యప్ తెలిపారు. గ్రామీణ క్రీడల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర క్రీడలను వృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.సిమ్లాలో నాలుగు రోజుల పాటు జరిగిన అండర్ - 14 క్రీడా టోర్నీ ముగింపు కార్యక్రమానికి కాశ్యప్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టడం వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో నేడు భారత్ సవాలుగా మారుతోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మౌళికసదుపాయాలను కల్పించేందుకు కేంద్రం అంగీకరించిందని వివరించారు. |