జైపూర్‌లో జూలై 22 నుండి ప్రారంభం కానున్న 15వ ఆసియా జూనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే 16 మంది సభ్యులు గల భారత జట్టులో టాప్ పాడ్లర్ సౌమ్యాజిత్ ఘోష్ ఉన్నాడు. అలాగే జి సాథియన్, రాజ్ మొండాల్ మరియు హర్మీత్ దేశాయ్‌లు కూడా ఈ జట్టులో స్థానం సంపాదించారు.
అండర్ - 18 బాలుర జూనియర్ విభాగంలో వీరు పోటీపడతారు. జూనియర్ బాలికల విభాగంలో అంకితా దాస్, మల్లికా భండార్కర్, శ్రేయా ఘోష్ మరియు చార్వీ కావ్లేలు ప్రాతినిధ్యం వహించనున్నారు. కాడెట్ (అండర్-15) బాలుర విభాగంలో సందీప్ దే, రాజీవ్ సర్కార్, అభిషేక్ యాదవ్, ఉత్కర్ష్ గుప్తా తదితరులు.. అలాగే ఇదే కాడెట్ బాలికల విభాగంలో మల్లికా భండార్కర్, టీఆర్ రిషియా, కామిలా సిల్ మరియు మోనికా బాత్రాలు భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీకి సునీల్ బాబ్రాస్, వీకే అగర్వాల్, మంతు ఘోష్ తదితరులు కోచ్‌లుగా వ్యవహరిస్తారు.
జట్లు: జూనియర్ బాలుర విభాగం: సౌమ్యాజిత్ ఘోష్, జీ సాథియన్, రాజ్ మొండాల్, హర్మీత్ దేశాయ్, బాలికల విభాగం: అంకితా దాస్, మల్లికా భండార్కర్, శ్రేయా ఘోష్, ఛార్వీ కావ్లే
కాడెట్ బాలురు: రాజీవ్ సర్కార్, అభిషేక్ యాదవ్, సందీపన్ దే, ఉత్కర్ష్ గుప్తా బాలికల విభాగం: మల్లికా భండార్కర్, మోనికా బాత్రా, కామిలా సిల్, టీఆర్ రిషియా |