ప్రాక్టీసులో ఉండగా దురదృష్టవశాత్తు కుడి కంటికి గాయమై ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స పొందుతున్న భారత జట్టు గోల్‌కీపర్ బల్జీత్ సింగ్‌ను క్రీడాశాఖ మంత్రి ఎం ఎస్ గిల్ పరామర్శించారు. తమవైపు నుండి పూర్తి సహాయాన్ని అందజేస్తామని బల్జీత్‌కు ఈ సందర్భంగా గిల్ హామీ ఇచ్చారు.కంటిగాయం నుండి బల్జీత్ తిరిగి కోలుకోవడం వీలుకాదని.. దీంతో బల్జీత్ కెరీర్ ముగిసిపోయే ప్రమాదంలో పడిందని వచ్చిన వార్తల నేపథ్యంలో గిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. బల్జీత్‌కు యథావిధిగా కంటిచూపు వచ్చే వరకు తాము సాయం అందిస్తామన్నారు.ఇక్కడ కాకపోతే.. విదేశాలకు పంపి అయినా సరే శస్త్రచికిత్స జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల కోసం సిద్ధం అవుతున్న ఈ తరుణంలో బల్జీత్ వంటి చురుకైన ఆటగాడు తీవ్రంగా గాయపడటం దురదృష్టకరమైన విషయంగా పేర్కొన్నారు.కాగా, బల్జీత్‌ను కలిసేందుకు హాకీ ఇండియా (హెచ్ఐ) జనరల్ కార్యదర్శి మొహ్మద్ అస్లామ్ ఖాన్ కూడా ఎయిమ్స్ వైద్యశాలకు విచ్చేశారు. సుదీర్ఘసమయం తర్వాత లభించిన ఓ అత్యుత్తమ గోల్‌కీపర్ తమకు అందుబాటులో లేకుండా పోవడం తమను కొంత మేరకు నిరుత్సాహానికి గురిచేస్తోందన్నారు.బల్జీత్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి అస్లామ్ ఖాన్ మాట్లాడుతూ, శారీరకంగా బల్జీత్ ఫిట్‌గానే ఉన్నాడని.. వేళకు భోజనం అన్నీ చేస్తున్నాడన్నారు. అయితే కుడికంటి చూపుకు సంబంధించి ఇంకా పరిశీలనలో ఉంచారని.. ఇప్పుడప్పుడే దాని గురించి చెప్పడం సాధ్యం కాదన్నారు. |