ప్రధాన పేజి > క్రీడలు > ఇతర క్రీడలు > వార్తలు > హాకీ ఇండియా లోగో ఆవిష్కరణ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హాకీ ఇండియా లోగో ఆవిష్కరణ
24 హాకీ స్టిక్‌లతో కూడిన అశోక చక్రాన్ని తలపించే విధంగా కొత్త లోగోను హాకీ ఇండియా (హెచ్ఐ) విడుదల చేసింది. హెచ్ఐ అధ్యక్షుడు ఏకే మాట్టూ, జనరల్ కార్యదర్శి మొహమ్మద్ అస్లామ్, సీనియర్ ఉపాధ్యక్షుడు విద్యా స్టోక్స్, చీఫ్ కోచ్ జోస్ బ్రాసా, కోచ్ హరేంద్ర సింగ్ మరియు భారత హాకీ జట్టు కెప్టెన్ సందీప్ సింగ్‌లు సంయుక్తంగా ఈ లోగోను ఆవిష్కరించారు.

24 ఆకులు గల ఈ ఆశోక చక్రం స్ఫూర్తికి చిహ్నమని హెచ్ఐ తెలిపింది. విలేకరులతో మాట్టూ మాట్లాడుతూ, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) నుండి తమకు గుర్తింపు లభించిందని.. సరికొత్త ప్రణాళికలతో హెచ్ఐ విభిన్నంగా ముందుకు దూసుకెళుతుందన్నారు.

2010 హాకీ ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి బాధ్యతలు తమపై ఉన్నాయన్నారు. హెచ్ఐకు ఇది మరొక విజయంగా అభివర్ణించారు. కాగా, ప్రపంచకప్‌ టోర్నీకి ముందు పురుషుల, మహిళల అసోసియేషన్‌లను విలీనం చేసి మరియు ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని భారత్‌ను ఎఫ్ఐహెచ్ కోరింది.

ఈ ప్రతిపాదన మేరకు భారత్‌లో హెచ్‌ఐ ఏర్పాటయింది. సహారా ఇండియాతో స్పాన్సర్‌షిప్ గురించి అడగగా.. ఇప్పటి వరకు అలాంటి వేమీ లేవన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
హాకీ వెనుకబడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది: బ్రాసా
ఆర్చర్ దీపికకు టాటా స్టీల్ క్యాష్ అవార్డ్
ఔరంగాబాద్ బాడీ బిల్డింగ్ టోర్నీయే నిజం
హాంబర్గ్‌లో కొనసాగుతున్న ఛార్డీ జైత్రయాత్ర
ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ: ప్రీ క్వార్టర్స్‌లో శ్రీధర్, ప్రకాశ్
వందశాతం నే ఫిట్‌గానే ఉన్నా: షరపోవా