ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కెనడా ఏటీపీ ఛాలెంజర్‌లో మన్కడ్ జోడీ ఔట్ (Other Sports | Tennis | Canada | ATP Challenger | Mankad | Treat | out | Israeli pair)
కెనడా ఏటీపీ చాలెంజర్ ఈవెంట్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన హర్ష్ మన్కడ్, ఫిలిప్పైన్స్‌కు చెందిన అతని భాగస్వామి ట్రీట్ కొన్రాడ్ హుయేలు ఓటమి చవిచూశారు. ఈ టోర్నీ తొలి రౌండులో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన జోడీ చేతిలో భారత-ఫిలిప్పైన్స్ జోడీ పరాజయం పాలైంది.
మన్కడ్, ట్రీట్‌ల జోడీ ఈ మ్యాచ్‌లో తమ స్థాయికి తగ్గట్టుగా ఆటతీరును ప్రదర్శించలేకపోయారు. దీంతో భారత్, ఫిలిప్పైన్స్ జోడీపై 5-7, 6-2, 7-10తో ఇజ్రాయెలీ జోడీ హరెల్ లెవీ, అమీర్ హదాద్‌లు గెలుపొందారు. తొలి రౌండు నుండే నిష్క్రమించడంతో ఈ జోడీ ఒక్క పాయింట్ కూడా దక్కలేదు. తొలిరౌండు ఓటమి అయినప్పటికీ.. 360 డాలర్ల ప్రైజ్‌మనీని ఇద్దరు పంచుకున్నారు.