వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » అమెరికాలో బల్జీత్‌కు వైద్యం: హాకీ ఇండియా (Other Sports | Hockey | Baljit to be treated in US | Hockey India | Aslam Khan | Johns Hopkins hospital)
 
File
FILE
కుడి కంటి గాయంతో బాధపడుతున్న భారత హాకీ జట్టు గోల్‌కీపర్ బల్జీత్ సింగ్‌ను అత్యున్నత వైద్యం నిమిత్తం అమెరికాకు పంపనున్నట్లు హాకీ ఇండియా వెల్లడించింది. ప్రాక్టీసు సందర్భంగా దురదృష్టవశాత్తు గాయమై ప్రస్తుతం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న బల్జీత్‌కు మరింత అత్యున్నత వైద్య సేవల అవసరం ఉందని భావిస్తూ.. ఈ నిర్ణయం తీసున్నట్లు హాకీ ఇండియా కార్యదర్శి మొహమ్మద్ అస్లామ్ ఖాన్ వెల్లడించారు.

న్యూఢిల్లీలో ఆయన విలకేరులతో మాట్లాడుతూ, అమెరికాలో బల్జీత్ వైద్యానికి అయ్యే ఖర్చును మొత్తం భరించేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ అంగీకరించిందన్నారు. దీంతో బల్జీత్‌ను అమెరికా పంపాలని నిర్ణయించామన్నారు. బల్జీత్ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లపై ప్రస్తుతం క్రీడా మంత్రిత్వ శాఖతో చర్చిస్తున్నట్లు తెలిపారు.

అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ వైద్యశాలలో బల్జీత్ చికిత్సకు ఏర్పాట్లు చేసే అవకాశం ఉందన్నారు. బల్జీత్‌ను తిరిగి మైదానంలోకి తీసుకువచ్చే వరకు హాకీ సమాఖ్య అతనికి వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. కాగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ వద్ద ప్రాక్టీసు సెషన్‌లో పాల్గొన్న బల్జీత్.. కోచ్ కొట్టి బంతిని పట్టుకునే క్రమంలో గాయపడ్డాడు.

బంతి నేరుగా హెల్మెట్‌ను దాటి బల్జీత్ కుడికంటిని తాకడంతో తీవ్రగాయమయింది. దీంతో బల్జీత్‌ను హుటాహుటిన ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుండి ఎయిమ్స్‌లో బల్జీత్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

అదలా ఉంచితే.. బంతి కంటికి బలంగా తగలడంతో బల్జీత్ కుడి కంటి రెటీనా భాగం బాగా దెబ్బతిందని.. దీంతో అతను చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉందని వైద్యులు ఆందోళ చెందుతున్నట్లు తెలిసింది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.