ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు 17 మంది రెజ్లర్లు (Other sports | Wrestling | World Championship | 17 Wrestlers | Denmark)
డెన్మార్క్‌లో జరిగే ప్రపంచ మహిళ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఆరు మంది మహిళలతో పాటు 17 మంది సభ్యులు భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. సీనియర్ వరల్డ్ ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్ స్టైల్ విభాగాల్లో ఈ పోటీలు జరగునున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి 27వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతాయి.
అలాగే పురుషుల రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లోను 11 మంది పాల్గొంటున్నారు. ఫ్రీ స్టైల్‌లో ఆరు మంది, గ్రీకో రోమన్ విభాగంలో ఐదు మంది పోటీ పడనున్నారు.
జట్టు: ఫ్రీ స్టైల్: బాల్‌రాజ్ సింగ్ (55 కేజీలు), హర్దీప్ సింగ్ (60 కేజీలు), సుశీల్ కుమార్ (66 కేజీలు), రమేష్ కుమార్ (74 కేజీలు), అనిల్ మాన్ (96 కేజీలు), జోగిందర్ కుమార్ (120 కేజీలు) గ్రీకో రోమన్ స్టైల్: రాజేందర్ కుమార్ (55 కేజీలు), రవీందర్ సింగ్ (60 కేజీలు), సునీల్ కుమార్ (66 కేజీలు), అనిల్ కుమార్ (96 కేజీలు), ధర్మేందర్ దలాల్ (120 కేజీలు), మహిళల జట్టు: నిర్మల్ దేవి (48 కేజీలు), బబితా (51 కేజీలు), అల్కా తొమార్ (59 కేజీలు, సుమన్ కుండు (63 కేజీలు), గీతికా జాఖర్ (67 కేజీలు), గురుశరణ్‌ప్రీత్ కౌర్ (72 కేజీలు)