వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బ్యాడ్మింటన్ టోర్నీ: అంతిమసమరం నేడే (Other Sports | World Badminton tourny | today is Final battle | Chen Zin | Zing Phang | Lu Laan)
 
ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ నేటితో చివరి దశకు చేరుకుంది. నేడు అన్ని విభాగాల్లోను ఫైనల్స్ జరుగనున్నాయి. ప్రపంచ స్థాయి అగ్రశ్రేణి క్రీడాకారులతో ఈ టోర్నీలో అడుగుపెట్టిన చైనా.. ఒక మిక్స్‌‌డ్ డబుల్స్ మినహాయిస్తే.. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్‌లలో పోటీ పడనుంది.

ఏదైతేనేం.. ఈ సారి చైనా పురుషుల టాప్ ర్యాంక్ ఆటగాడు లిన్ డాన్.. చైనాకే చెందిన మహిళల టాప్ ర్యాంక్ క్రీడాకారిణి జీ జింగ్ ఫాంగ్‌లు ఫైనల్లో విజయం సాధిస్తే.. మూడు సార్లు ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకున్న వారిగా రికార్డ్ సృష్టిస్తారు.

అంతకుముందు.. ఈ టోర్నీ పురుషుల సెమీస్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్ జిన్ చేతిలో ఇండోనేషియాకు చెందిన మాజీ ఛాంపియన్ తౌఫిక్ హిదాయత్ ఓటమి చవిచూశాడు. మరో మ్యాచ్‌లో డాన్ చేతిలో ఇండోనేషియాకే చెందిన ఆరో సీడ్ సోనీ ద్వికున్‌కోరో పరాజయం పాలయ్యాడు.

దీంతో ఫైనల్లో చెన్‌జిన్‌తో డాన్ తలపడనున్నాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌లో జింగ్ ఫాంగ్‌తో ఏడో సీడ్ లూ లాన్‌తో తలపడనుంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.