ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » మాంట్రియల్ మాస్టర్స్ ఫైనల్లో భూపతి జోడీ (Other Sports | Tennis | Montreal Masters | Bhupati pair in Final | Knowles)
మాంట్రియల్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి, బహామాస్‌కు చెందిన అతని భాగస్వామి మార్క్ నొవెల్స్‌ల జోడీ ఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో రెండో సీడ్ కెనడా, సెర్బియాల జోడీ.. డేనియల్ నెస్టర్.. నినాద్ జిమాంజిక్‌లపై భూపతి, నొవెల్స్ జోడీ గెలుపొందింది.
మూడో సీడ్‌గా బరిలోకి దిగిన భారత్-బహామాస్ జోడీ.. సుమారు ఒక గంట 25 నిమిషాలు పోరాడి.. కెనడా, సెర్బియాల జోడీపై 5-7, 6-2, 10-4తో గెలుపొందింది. గత ఏడాది టోరంటోలో జరిగిన టైటిల్ పోరులో.. నెస్టర్, జిమోంజిక్‌ల జోడీని.. భూపతి, నొవెల్స్ జోడీ నిలువరించింది.
కాగా, ఐదో కెనడా డబుల్స్ టైటిల్ కోసం చూస్తున్న భూపతి జోడీ.. ఫైనల్లో.. ఏడో సీడ్ బెలారష్యన్, ఇజ్రాయేల్ జోడీ మాక్స్ మిర్నీ, ఆండీ రామ్‌లతో తలపడనుంది. సెమీస్‌లో జరిగిన మ్యాచ్‌లో మాక్స్, రామ్‌ల జోడీ అమెరికా కవలలు అయిన బాబ్, మైక్ బ్రియాన్‌ల జోడీపై 7-6 (5), 6-2తో గెలుపొందింది.