ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » చెస్: ఆసియా జోన్స్‌లో కృత్తిక గెలుపు (Other Sports | Chess | Asia Zones | Kruttika wins | World cup, Sultana Sharmin, Nisha)
న్యూఢిల్లీలో జరిగిన ఆసియా జోన్ 3.2 మహిళల చెస్ టైటిల్ పోరులో జాతీయ ఛాంపియన్ కృత్తిక నాడిగ్ గెలుపొందింది. ఈ టోర్నీ ఫైనల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో గ్రాండ్‌మాస్టర్ నిషా మొహోతాపై కృత్తిక తిరుగులేని విజయాన్ని నమోదు చేసి.. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా కానుకగా టైటిల్ సంపాదించుకుంది.
ఈ టైటిల్ విజయంతో కృత్తిక వచ్చే ప్రపంచకప్ టోర్నీలో బెర్త్‌ను ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీ చివరి రోజున నాటకీయపరిణామాల మధ్య అంతిమ సమరం సాగింది. మరో టైటిల్ పోటీ దారు బంగ్లాదేశ్‌కు చెందిన సుల్తానా షర్మిన్ షిరిన్‌పై.. ఏడో రౌండులో శ్రీలంకకు చెందిన సాచినీ రణసింఘే గెలుపొందింది.
పూణేకు చెందిన కృత్తిక.. ఫైనల్ సమరంలో కేవలం 64 పావులు కదిలించి ప్రత్యర్థిని కట్టడి చేసింది. ఇక ఈ టోర్నీలో 4 పాయింట్లతో నిషా మొహతా, టాప్ సీడ్ తానియా సచ్‌దేవ్‌లు రెండు స్థానంతో సంయుక్తంగా ఉండాల్సింది, కానీ.. టై బ్రేక్ స్కోరు సాయంతో తానియా రెండో స్థానంతో... నిషాయ మూడో స్థానంతో సంతృప్తిపడ్డారు.