వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రపంచ అథ్లెటిక్స్: ఓల్లా కనిస్కినాకు స్వర్ణం (Sports| Other Sports| World Athletics| Olga Kaniskina| Gold Russia)
 
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ మహిళల 20 కిలోమీటర్ల విభాగంలో ఓల్గా కనిస్కినా స్వర్ణం సాధించింది. తొలిరోజు శనివారం జరిగిన పురుషుల 20 కిలోమీటర్ల విభాగంలో వాలెరి బోర్చిన్ (రష్యా) పసిడి పతకాన్ని సొంతం చేసుకోగా, రెండో రోజైన ఆదివారం జరిగిన మహిళల 20 కిలోమీటర్ల విభాగంలో కనిస్కినా రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

దీంతో రష్యా ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. 20 కిలోమీటర్ల లక్ష్యాన్ని డిఫెండింగ్ ఛాంపియన్ కనిస్కినా 28 నిమిషాల 9 సెకన్లలోనే నిర్ణీత లక్ష్యాన్ని చేధించి విజేతగా నిలిచింది.

ఇకపోతే.. ఇదే మహిళల 20 కిలోమీటర్ల విభాగంలో ఒలివ్ లౌగస్ (ఐర్లాండ్), లియుహాంగ్ (చైనా) రజత, కాంస్య పతకాలను సాధించారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.