ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » సీనియర్ నేషనల్ హాకీ టోర్నీ వాయిదా (Other Sports | Hockey | Senior National Championship | Postponed | Mohd Aslam)
పూణే సెప్టెంబర్‌లో జరగాల్సిన సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్‌షిప్ టోర్నీ వాయిదా పడింది. భారత్‌లో ప్రత్యేకించి పూణేలో ప్రాణాంతక స్వైన్ ఫ్లూ వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా ఈ టోర్నీ వాయిదా పడినట్లు టోర్నీ నిర్వాహకులు తెలిపారు.
హాకీ ఇండియా (హెచ్ఐ) కార్యదర్శి మొహ్మద్ అస్లామ్ మాట్లాడుతూ, స్వైన్ ఫ్లూ పరీక్షా కేంద్రాల నుంచి తమకు వస్తున్న నివేదికల ప్రకారం పూణే పరిస్థితి ప్రస్తుతం కొంత మేరకు ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో షెడ్యూల్ ప్రకారం టోర్నీని నిర్వహించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.
హెచ్1ఎన్1 పరిస్థితుల్లో సీనియర్ పురుషుల నేషనల్ హాకీ టోర్నీ వాయిదా వేస్తున్న హెచ్ఐ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఇక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత ఈ టోర్నీకి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు.
కాగా, మూడేళ్ల క్రితం ఈ టోర్నీని జలంధర్‌లో నిర్వహించారు. ఈ ఏడాది పూణేలో సెప్టెంబర్ 13 నుంచి 27వ తేదీ వరకు ఈ టోర్నీ నిర్వహించాల్సి ఉంది.