వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » హాకీ ప్రపంచకప్‌లో భారత్ శక్తిగా ఎదుగుతుంది (Other Sports | Hockey | Hockey world cup | India will be force | Sandeep Singh)
 
న్యూఢిల్లీలో వచ్చే ఏడాది జరుగనున్న హాకీ ప్రపంచకప్ పోటీల సమయానికి భారత్ శక్తిగా ఎదుగుతుందని కెప్టెన్ సందీప్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాలుగు దేశాల యూరప్ పర్యటనలో ఉన్న భారత జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోందన్నాడు.

పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ, ప్రపంచకప్‌ సమయానికి భారత జట్టు ఓ సంపూర్ణ రూపానికి వస్తుందన్నాడు. ప్రపంచ కప్‌లో అగ్రస్థానంలో ఉన్న టాప్ జట్లకు బలమైన పోటీనిచ్చే ఓ శక్తిగా భారత్ ఎదుగుతోందన్నాడు. కాగా.. గత ఏడాది భారత జట్టుకు చేదు అనుభవాలని మిగిల్చింది.

ఎనిమిదిసార్లు ఒలింపిక్ ఛాంపియన్‌లుగా నిలిచిన భారత్ చరిత్రలో తొలిసారిగా గత ఏడాదిలో బీజింగ్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కూడా కాలేకపోయింది. ఆ తర్వాత స్పెయిన్‌కు చెందిన జోస్ బ్రాసాను భారత హాకీ జట్టు కోచ్‌గా ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం బ్రాసా నేతృత్వంలోనే భారత జట్టు నాలుగు దేశాల యూరప్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.