ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » 24 నుంచి హర్యానా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ (Sports| Other Sports| Haryana| Boxing Championship| Jitender Kumar)
హర్యానా రాష్ట్ర బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఈ నెల 24-27వ తేదీ వరకు జరుగనున్నాయి. 42వ సీనియర్ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 150మంది బాక్సర్లు పాల్గొంటారు. వీరితో పాటు 25మంది టెక్నికల్ అధికారులు కూడా పాలుపంచుకుంటారని హర్యానా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా వెల్లడించారు.
ఈ అసోసియేషన్ ఛైర్మన్ డాక్టర్ కె.ఎస్. సొలంకి, కెప్టెన్ మెహ్తప్ సింగ్‌ల ఆధ్వర్యంలో జట్టు ఎంపిక జరిగిందని చౌతాలా అన్నారు. ఇందులో భాగంగా అర్జున అవార్డు గ్రహీత జితేందర్ కుమార్, అర్జున అవార్డు గ్రహీతలు థాకూర్ జోగిందర్ సింగ్, దివాన్ సింగ్, కెప్టెన్ బి.ఆర్. శర్మ, ఎం.ఎం. భరద్వాజ, సీనియర్ కోచ్ కటార్‌లు పాల్గొంటారని అభయ్ సింగ్ తెలిపారు.
ఈ బాక్సింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన ఆటగాళ్లు జార్ఖండ్‌లో నవంబర్ 21 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు జరిగే 34వ జాతీయ క్రీడల్లో పాల్గొనవచ్చునని చౌతాలా వివరించారు.