దక్షిణాఫ్రికాలో జరుగుతున్న డేవిస్ కప్ టోర్నీలో భారత జట్టు బోణీ కొట్టింది. శుక్రవారం జోహెన్స్‌బర్గ్‌లో జరిగిన ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాను ఖంగుతినిపించింది. దీంతో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత యువ టెన్నిస్ ఆటగాడు సోమ్‌దేవ్ 7-6 (5), 6-3, 6-4 తేడాతో ప్రత్యర్థి ఇజాక్ వాన్ డెర్ మెర్వ్ (దక్షిణాఫ్రికా)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న టాప్ సీడ్ రిక్ డి వోస్ట్‌తో తలపడనున్నాడు.