వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ప్రపంచ గ్రూప్ అర్హత: ఒక్క విజయం దూరంలో భారత్ (Sports| other Sports| Somdev| Davis Cup| Bopanna| World Group Play Of Match)
 
Somdev
FILE
దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో తొలి రోజున భారత్ రెండు విజయాలను నమోదు చేసుకుంది. పదకొండు సంవత్సరాలుగా ఊరిస్తున్న ప్రపంచ గ్రూప్ అర్హతను సాకారం చేసుకునేందుకు భారత జట్టు ఒక్క విజయం దూరంలో నిలిచింది.

డేవిస్‌కప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాతో జోహెన్స్‌బర్గ్‌లో జరుగుతోన్న ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ ప్రారంభంలో భారత్ 2-0 ఆధిక్యం సంపాదించింది. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లేదా ఆదివారం జరిగే రెండు రివర్స్ సింగిల్స్‌లో ఏదైనా ఒక్క మ్యాచ్‌లో నెగ్గినా 1998 తర్వాత తొలిసారిగా భారత్ ప్రపంచ గ్రూప్ పోటీలకు అర్హత సాధిస్తుంది.

ఇదిలా ఉంటే.. డేవిస్ కప్ తొలి సింగిల్స్‌లో భారత స్టార్ సోమదేవ్ దేవ్ వర్మన్ 7-6 (7/5), 6-3, 6-4తో ఐడాక్ వాన్ డెర్ మెర్వ్ (దక్షిణాఫ్రికా)పై గెలుపుపొందగా, రెండో సింగిల్స్‌లో రోహన్ బోపన్న 2-6, 6-4, 6-2, 6-4 పాయింట్ల తేడాతో రిక్ డీ వోస్ట్ (దక్షిణాఫ్రికా)ను ఓడించి భారత్‌ను 2-0తో ఆధిక్యంలో నిలబెట్టారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.