ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » బాక్సింగ్‌ను ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తా: విజేందర్ (Sports| Other Sports| Boxing| Promote| Vijender| Olympic Winner| Cricket)
బాక్సింగ్‌ను ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తా: విజేందర్
FILE
బాక్సింగ్‌ను ప్రమోట్ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఒలింపిక్ కాంస్య విజేత విజేందర్ సింగ్ అన్నాడు. క్రికెట్ అంటే ఎంతో ఆసక్తితో చూసే భారత అభిమానులు ఇతర క్రీడలపై ఆసక్తి కనబరచకపోవడం ఎంతో బాధగా ఉందని విజేందర్ చెప్పాడు.
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరిస్తున్న బాక్సింగ్ భారత్‌లో మాత్రం అభిమానుల ఆదరణకు నోచుకోవడం లేదని విజేందర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ బాక్సింగ్‌లో భారత్ రోజురోజుకు బలమైన జట్టుగా ఎదుగుతుందన్నాడు. దీనికి తగినంత ప్రోత్సాహం లభిస్తే రానున్న రోజుల్లో అద్భుత ఫలితాలు సాధించే సత్తా బాక్సర్లకుందన్నాడు.
ఇటీవల జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకొని సత్తా చాటిన విజేందర్ భారత్‌లో బాక్సింగ్‌ను ప్రమోట్ చేయడానికి నడుంబిగించాడు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా రియాల్టీ షోలు నిర్వహిస్తూ బాక్సింగ్‌కు ప్రాచుర్యం కల్పించేందుకు ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ముంబయిలో జరిగిన రియాల్టీ షోలు అతను పాల్గొన్నాడు.