ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఢిల్లీ షూటింగ్ ప్రపంచకప్ రద్దు (Other Sports| Other Sports| Delhi Shooting World Cup Cancel| Pistol| Olympic Berth)
దేశరాజధాని నగరం ఢిల్లీ జరగాల్సిన ప్రతిష్టాత్మిక పిస్టల్, రైఫిల్ ప్రపంచకప్‌కు చుక్కెదురైంది. వచ్చే ఏడాది మార్చిలో ఢిల్లీలో జరగాల్సిన ఈ టోర్నీ రద్దైనట్లు అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎన్ఎన్ఎఫ్) తెలిపింది. 2010 ఐఎన్ఎన్ఎఫ్ ప్రపంచకప్ రద్దైనట్లు ఓ ప్రకటనలో సమాచారం అందింది.
ఒలింపిక్ బెర్తులు లేకపోవడం వల్లే ఈటోర్నీ నుంచి భారత్ తప్పుకుందని ఐఎన్ఎన్ఎఫ్ తెలిపింది. ఒలింపిక్ బెర్తుల కేటాయింపుల విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐవోసి) అనుసరిస్తోన్న వైఖరియే ఈ టోర్నీ నుంచి భారత్ వైదొలగడానికి ప్రధాన కారణమని ఐఎన్ఎన్ఎఫ్ ఆ ప్రకటనలో తెలియజేసింది.
అయితే ప్రపంచకప్ రద్దవడానికి షూటింగ్ రేంజ్ పనులు పూర్తి కాకపోవడమే ప్రధాన కారణమని వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తలు అవాస్తవమని జాతీయ రైఫిల్స్ సంఘం అధ్యక్షుడు బల్జీత్ సింగ్ అంటున్నాడు. ఒలింపిక్ కోటా లేకపోవడంతోనే ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని సింగ్ స్పష్టం చేశారు.