ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఆసియా మహిళల బాస్కెట్‌బాల్: భారత్‌కు రెండో ఓటమి (Sports| Other Sports| Asia Basketball ChampionShip| India| Korea| China| Thailand)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో జరుగుతోన్న ఆసియా మహిళల బాస్కెట్‌బాల్ పోటీల్లో భారత్ జట్టు రెండో ఓటమిని చవిచూసింది. ప్రారంభమ్యాచ్‌లో కొరియా చేతిలో ఖంగుతిన్న భారత మహిళలజట్టు శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చైనా తైపీ జట్టు చేతిలో పరాజయం పాలైంది.
ఈ 23వ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన లెవల్-1 విభాగంలో భారత జట్టు, చైనా తైపీ జట్టుతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ ప్రారంభంలో కాస్త మెరుగ్గా ఆడిన భారత్ 5-12 పాయింట్ల తేడాతో ఆధిక్యంలో నిలిచింది. తర్వాత పుంజుకున్న చైనా తైపీ జట్టు భారత్‌ను ధీటుగా ఎదుర్కొని 61-84 పాయింట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది.
భారత మహిళల బాస్కెట్ బాల్ జట్టులో అన్నా జోస్ అత్యధికంగా 34 పాయింట్లు సాధించింది. చైనా తైపీ జట్టులో షిక్ షైయ్, జాయూలు చెరో 15 పాయింట్లు చేశారు.
మరో మ్యాచ్‌లో చైనా జట్టు 75-58 పాయింట్లతో జపాన్‌ను మట్టికరిపించి ఈ ఛాంపియన్‌షిప్‌లో రెండో గెలుపును నమోదు చేసుకుంది. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ కొరియా రెండో మ్యాచ్‌లో 116-45 పాయింట్ల తేడాతో థాయ్‌లాండ్‌పై సునాయాసంగా నెగ్గింది.