ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఫిబా ఆసియా బాస్కెట్‌బాల్: మలేషియా, ఫిలిప్పైన్స్ గెలుపు (FIBA Asia Basketball champioships| Sports| Malaysia| Kazhakstan| Philippines)
ఫిబా ఆసియా బాస్కెట్‌బాల్: మలేషియా, ఫిలిప్పైన్స్ గెలుపు
చెన్నై నగరంలోని నెహ్రూ స్టేడియంలో జరుగుతోన్న 23వ మహిళల ఫిబా ఆసియా బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఫిలిప్పైన్స్, మలేషియాలు విజయాన్ని నమోదు చేసుకున్నాయి. శనివారం జరిగిన లెవల్-2 విభాగంలో మలేషియా కజగస్థాన్‌తో బరిలోకి దిగింది. ప్రత్యర్థి జట్టుపై గట్టిపోటీని ప్రదర్శించిన మలేషియా జట్టు.. 71-57 పాయింట్ల తేడాతో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో మలేషియాకు జట్టు తరపున అత్యధిక పాయింట్లను సాధించిన వారిలో ఆంగ్‌స్యూ టెంగ్ (20), పి యాన్ (16)లు ఉన్నారు. అలాగే కజగస్థాన్ జట్టులో నటాలయా (18) పాయింట్లు సాధించింది.
ఇదేవిధంగా.. లెబనాన్ బాస్కెట్‌బాల్ జట్టు శనివారం శ్రీలంకపై 96-54 పాయింట్ల తేడాతో గెలిచింది. లెబనాన్‌కు చెందిన చెంటెల్లా ఆండర్సన్ అత్యధికంగా 22 పాయింట్లు సాధించి, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
మరో మ్యాచ్‌లో ఫిలిప్పైన్స్ జట్టు ఉజ్భెకిస్థాన్‌ను 81-73 పాయింట్ల తేడాతో మట్టికరిపించింది. దీంతో ఈ ఛాంపియన్‌షిప్‌లో ఫిలిప్పైన్స్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.