వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » హాకీలో అసాధారణ ఫలితం ఆశించొద్దు: బ్రాసా (FIH hockey World Cup | India | Jose Brasa)
 
వచ్చే ఏడాది జరిగే ఎఫ్ఐహెచ్ హాకీ ప్రపంచకప్ మరో ఐదు నెలల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో.. భారత హాకీ కోచ్ జోష్ బ్రాసా మాట్లాడుతూ.. హాకీ జట్టు నుంచి అసాధారణ ఫలితాలు ఆశించవద్దని సూచించారు. జట్టు నుంచి అద్భుతాలు ఆశించడం అవాస్తవిక అంచనాలు అవతాయన్నారు. ఈ భారీ హాకీ టోర్నమెంట్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 13 వరకు జరుగుతుంది.

ఎనిమిదిసార్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టుపై ఈ టోర్నీలో భారీ అంచనాలు పెట్టుకోవద్దని బ్రాసా తెలిపారు. వచ్చే ఏడాది జరిగే మూడు ప్రధాన టోర్నీల్లో ఆతిథ్య జట్టు మెరుగైన ప్రదర్శన ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వచ్చే ఏడాది భారత మూడు ప్రధాన హాకీ టోర్నమెంట్‌లకు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలకు భారత్‌లోనే జరగనున్నాయి. ఈ మూడు టోర్నీల్లో కనీసం రెండు టైటిళ్లనైనా గెలుచుకోవాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రాసా వెల్లడించారు. మూడు లేదా కనీసం రెండు టైటిళ్లు నెగ్గడమే జట్టు ముందున్న ప్రధాన లక్ష్యమని తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.