వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కోల్‌కతా ఐటీఎఫ్ టోర్నీలో స్టార్‌గా యూకీ బాంబ్రీ (Kolkata ITF tennis tourny | star | Yuki Bhambri | Vishnu Vardhan | BTA | Newzealand | September)
 
ఈ వారాంతంలో బెంగాల్ టెన్నిస్ అసోసియేషన్ (బీటీఏ) ఆధ్వర్యంలో జరుగనున్న ఓఎన్‌జీసీ ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ స్టార్ హోదాలో బరిలోకి దిగనున్నాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఐజాక్ వాన్ డెర్ మెర్వేపై విజయంతో.. డేవిస్ కప్ టోర్నీలో యూకీ బాంబ్రీ ఆరంగేట్రం చేశాడు.

బీటీఏ వర్గాల సమాచారం ప్రకారం.. ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీలో బాంబ్రీతో పాటు జాతీయ పచ్చగడ్డి కోర్టుల ఛాంపియన్ విష్ణువర్ధన్‌లు పోటీపడనున్నారన్నారు. అలాగే న్యూజిలాండ్, జర్మనీ, కొరియా, ఆస్ట్రేలియా, చైనీస్ తైపీ, బ్రిటన్ వంటి దేశాలకు చెందిన ప్రధాన ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నట్లు తెలిపారు.

న్యూజిలాండ్‌కు చెందిన ఐటీఎఫ్ ర్యాంకింగ్ 343 ర్యాంకు ఆటగాడు డేనియెల్ కింగ్ టర్నర్.. ఈ టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. కాగా, ఈ టోర్నీ సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరుగనుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.