వార్తలు | కథనాలు | ఆసక్తికర అంశాలు | ఒలింపిక్ 2008
ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » న్యూఢిల్లీలో రమేష్ కుమార్‌కు ఘనస్వాగతం (Wrestling Championship | Ramesh Kumar | hero's welcome | New Delhi)
 
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత్‌కు కాంస్య పతకం సాధించిపెట్టిన రమేష్ కుమార్ స్వదేశం చేరుకున్నాడు. స్వదేశంలో న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన రమేష్ కుమార్‌కు అపూర్వమైన ఘనస్వాగతం లభించింది.

అధికారులు మరియు కొన్ని వందల మంది రమేష్‌కు ఘనస్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, భారత రెజ్లింగ్‌కు ఇది ఎంతో గొప్పదైన రోజన్నాడు. తాను చేసిన కృషికి ఫలితం దక్కినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. రానున్న రోజుల్లో భారత రెజ్లింగ్ మరింతగా ఆదరణ పొందగలదని వివరించాడు.

1967లో ప్రపంచ కప్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌‌లో ఫ్రీస్టైల్ కేటగిరీలో విషంబర్ సింగ్ తొలి సారిగా రజత పతకం నెగ్గాడు. సుమారు 42 ఏళ్ల విరామం తర్వాత 74 కేజీల కేటగిరీలో మాల్డోవాకు చెందిన అలెగ్జాండర్ బుర్కాపై రమేష్ గెలుపొందాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.