ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » కామన్వెల్త్, లండన్ ఒలింపిక్స్‌లే నా లక్ష్యం: రమేష్ (Wrestling | Common Wealth games | London | Olympics | aim | Ramesh | World Championship)
కామన్వెల్త్, లండన్ ఒలింపిక్స్‌లే నా లక్ష్యం: రమేష్
న్యూఢిల్లీలో జరిగే కామన్వెల్త్ క్రీడలు, 2012లో జరిగే లండన్ ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు సాధించడమే తన తదుపరి లక్ష్యమని ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కాంస్య పతకం నెగ్గిన భారత రెజ్లర్ రమేష్ కుమార్ వెల్లడించాడు. సుమారు 42 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తొలి పతకాన్ని సాధించిన ఈ భారత రెజ్లర్ గతంలో.. అంటే.. 2005 కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకాన్ని సాధించాడు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకాన్ని సాధించిన సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా తాను ఎంతో కఠోరంగా శ్రమించినట్లు తెలిపాడు. ఆ శ్రమకు.. ఈ మెరుగైన ఫలితాలు వచ్చినట్లు వివరించాడు. 2010 కామన్వెల్త్ క్రీడలు, అలాగే 2012 లండన్ ఒలింపిక్స్‌లపై తాను దృష్టి సారించినట్లు వ్యాఖ్యానించాడు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గిన తర్వాత దేశం కోసం మరింతగా రాణించాలన్న స్ఫూర్తి తనలో కలిగినట్లు పేర్కొన్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనతకు ముందు చాలా ఏళ్ల తర్వాత బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యంతో మాత్రమే భారత్ ఎందుకు సరిపెట్టుకుంది అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. భారత రెజ్లర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
క్రికెటర్ల తరహాలో తమకు స్పాన్సర్లు, సౌకర్యాలను కల్పించినట్లయితే.. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించడం పెద్ద విషయమేమీ కాదన్నాడు.