ప్రధాన పేజి » క్రీడలు » ఇతర క్రీడలు » వార్తలు » ఇండోర్ క్రీడల్లో పాల్గొననున్న భారత ఆర్చర్లు (Asia Indoor games | Vietnam | Indian archers | recurve | compound | Malhotra)
వియత్నాంలో అక్బోటర్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 3వ ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత ఆర్చరీ జట్టు పాల్గొననుంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు జరిగే ఈ క్రీడలకు వెళ్లే భారత ఆర్చరీ జట్టులో.. రికర్వ్ విభాగంలో నలుగురు పురుషులు, ఓ మహిళ.. కాంపౌండ్ విభాగంలో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నారు.
ఈ జట్టుతో పాటు నలుగు కోచ్‌లను కూడా ఈ ఆసియా ఇండోర్ క్రీడలకు వెళ్లే భారత జట్టుకు ఎంపిక చేశారు. న్యూఢిల్లీలో భారత ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు వీకే మల్హోత్రా మాట్లాడుతూ.. సెప్టెంబర్ 20న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.. ఈ ఎంపిక ప్రక్రియను నిర్వహించిందన్నారు.
శిక్షణా శిబిరంలో వీరందరూ పాల్గొన్నారని.. అందరూ చక్కటి నైపుణ్యంతో.. దేశానికి పేరు తీసుకురాగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు.
రికర్వ్ జట్టు: పురుషుల జట్టు: రాజీవ్ బసుమాతరీ, డబ్లూ రంజన్ సింగ్, గురుచరణ్ బెస్రా, ఎన్ రవీంద్ర మహిళల జట్టు: పుణ్య ప్రభ
కాంపౌండ్ జట్టు: పురుషుల జట్టు: ఎం చింగ్లేన్‌సనా లువాంగ్, అభిషేక్ వర్మ, ఎల్ హరిదాస్, జయంతి లాల్ ననోమా. పురుషుల జట్టు: భాగ్యవతి ఛాను, సక్రో బెస్రా, వృషాలీ గోర్లే, స్వీటీ కుమారీ కోచ్‌లు: లోకేష్ చాంద్, రవి శంకర్, హరేందర్ కుమార్ సింగ్, ఆర్‌బి తమాంగ్ మేనేజర్: లెఫ్టినెంట్ కొలోనెల్ అభయ్ జవా